మంచిర్యాల జిల్లాలో చలి తీవ్రత పెరిగిందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డిఎం హెచ్ఓ హరీష్ రాజ్ తెలిపారు. గురువారం డిఎంహెచ్ఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీజనల్ ఇన్ఫెక్షన్ల కారణంగా శరీరం బలహీనపడే అవకాశం ఉందన్నారు. చలి రక్షణ కోసం వెచ్చని దుస్తులు ధరించాలన్నారు. చల్లని పానీయాలు తాగరాదని, వేడి ఆహార పదార్థాలు తీసుకోవాలని సూచించారు.