పోలీస్ శాఖలో ఉద్యోగ విరమణ పొందిన వారికి అండగా ఉంటామని రామగుండం సీపీ శ్రీనివాస్ అన్నారు. కమిషనరేట్ పరిధిలోని పలువురు అధికారులు ఉద్యోగ విరమణ పొందిన సందర్భంగా కమిషనరేట్ ఆవరణలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. బుధవారం సీపీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో సుధీర్ గా కాలం పాటు విధులు నిర్వహించి పోలీస్ శాఖకు ప్రజలకు అందించిన సేవలను ఆయన కొనియాడారు. కుటుంబ సభ్యులతో శేష జీవితాన్ని ఆనందంగా గడపాలని సూచించారు.