భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో జరుగుతున్న ఐద్వా 4వ రాష్ట్ర మహాసభల్లో మంచిర్యాల జిల్లా నాయకురాళ్లు బుధవారం పాల్గొన్నారు. ఈ మహాసభల్లో ఐద్వా జిల్లా కార్యదర్శి బండారి రాజేశ్వరి మాట్లాడుతూ జిల్లాలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టిన పోరాటాలపై నివేదిక సమర్పించారు. రాబోయే రోజుల్లో ఐద్వా ఆధ్వర్యంలో మహిళలను చైతన్యం చేసి ఉద్యమాల్లో భాగస్వాములను చేస్తామని తెలిపారు.