సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్ కు హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి, జేబీసీసీఐ సభ్యులు రియాజ్ అహ్మద్ శనివారం బహిరంగ లేఖ రాశారు. పర్మినెంట్ కార్మికులతో పాటు రిటైర్డ్ కార్మికులకు బకాయిలు, సవరించిన పెన్షన్ ఇప్పటివరకు ఇవ్వలేదని తెలిపారు. సీఎంపీఎఫ్ రిటైర్డ్ కార్మికులను వేధిస్తున్నారని, వెంటనే సవరించిన పెన్షన్ ఇప్పించాలని ఆయన కోరారు.