మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లక్ష్మీ థియేటర్ సమీపంలో ఫైనాన్స్ వ్యాపారిపై కొందరు వ్యక్తులు మద్యం మత్తులో దాడికి పాల్పడిన ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. శ్రీరాంపూర్ లోని కృష్ణ కాలనీకి చెందిన నగమూతు రమేష్ కు మరికొందరు వ్యక్తులకు బైక్ ఫైనాన్స్ విషయంలో వాగ్వావాదం జరిగింది. సరు వ్యకులు రమేష్ పై దాడి చేసి చేసి గాయపరిచారు. పోలీసులు అక్కడికి చేరుకోవడంతో వారు పారిపోయారు.