హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా-సింగరేణి ఆధ్వర్యంలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో పారిశ్రామిక సంబంధాలు సమస్త అభివృద్ది అనే అంశంపై అవగాహన సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు మందమర్రికి చెందిన ఐఎన్టీయూసి సెంట్రల్ కౌన్సిల్ సీనియర్ ఉపాధ్యక్షుడు కాంపెల్లి సమ్మయ్య ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనను ఎంపిక చేసిన రాష్ట్ర కనీస వేతనాల బోర్డు చైర్మన్ బి. జనక్ ప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపారు.