మద్యపాన నిషేధంపై ప్రతిజ్ఞ చేయించిన ఎమ్మెల్యే

76చూసినవారు
మద్యపాన నిషేధంపై ప్రతిజ్ఞ చేయించిన ఎమ్మెల్యే
దండేపల్లి మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన మహాత్మాగాంధీ జయంతి వేడుకల్లో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో మద్యపాన నిషేధంపై ప్రతిజ్ఞ చేయించారు. ముందుగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ భాస్కర్ తో కలిసి మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మండలంలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు.

సంబంధిత పోస్ట్