హాజీపూర్ లోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకి నీటి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 20. 175 టీఎంసీలకు గాను, 13. 667 టీఎంసీల నీరు ఉంది. ఎస్ఆర్ఎస్ పీ, కడెం నుంచి 3, 39, 782 లక్షల క్యూసెక్కులు, ఎగువ ప్రాంతాల నుంచి 70వేల క్యూసెక్కుల నీటి ఇన్ ఫ్లో వస్తోంది. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పథకానికి 298 క్యూసెక్కుల నీటిని తరలిస్తుండగా, 2, 40, 560 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు.