ఉపాధి హామీ పథకం సద్వినియోగం చేసుకోవాలి

68చూసినవారు
ఉపాధి హామీ పథకం సద్వినియోగం చేసుకోవాలి
ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలకు వరం అని జైపూర్ మండలం ఇందారం గ్రామ పంచాయితీ ప్రత్యేక అధికారి శ్రీపతి బాపురావు అన్నారు. శుక్రవారం గ్రామ పంచాయతీలో గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామసభలో ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరూ 100 రోజులు నిండేలా పనులకు హాజరు కావాలని కోరారు. ఈ సభలో ఏపీఓ వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి ఏ. సుమన్, ఫీల్డ్ అసిస్టెంట్ సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్