కంపోస్టు ఎరువు తయారీ విధానం

70చూసినవారు
కంపోస్టు ఎరువు తయారీ విధానం
మిగిలిపోయిన వ్యవసాయ వ్యర్థాలతో ఈ ఎరువు తయారుచేసుకోవచ్చు. ఎత్తయిన ప్రదేశంలో 1 మీ. లోతు, 2 మీ. వెడల్పు, అవసరమైనంత పొడవు గొయ్యి తవ్వాలి. వ్యర్థాలను 30 సెం.మీ. మందం పొరలుగా పేరుస్తూ, మధ్య మధ్యలో పేడ కలిపిన నీళ్లను, 8-10 కి. సూపర్‌ ఫాస్పేట్‌ చొప్పున ఒక్కొక్క పొరలో వేస్తూ నేల మట్టానికి 1/2 మీ ఎత్తువరకు నింపాలి. పైన పేడ మట్టితో అలకాలి. ఇలా 3-4 నెలల్లో వ్యర్థాలు చివికి కంపోస్టు తయారవుతుంది. పట్టణ వ్యర్థాలతోనూ కంపోస్టు చేయవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్