అక్కాచెల్లెళ్లతో పెళ్లి.. షాకిచ్చిన పోలీసులు

77చూసినవారు
అక్కాచెల్లెళ్లతో పెళ్లి.. షాకిచ్చిన పోలీసులు
AP: అక్కాచెల్లెళ్లతో పెళ్లికి సిద్ధమైన యువకుడికి పోలీసులు షాకిచ్చారు. శ్రీసత్యసాయి జిల్లా బాగేపల్లి టౌన్‌కు చెందిన గంగరాజు అక్కాచెల్లెళ్లు శ్రీలక్ష్మి, ఐశ్వర్యను ఈ నెల 10న పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. అయితే ఇద్దరు అక్కాచెల్లెళ్లు మైనర్లు కావడంతో ఈ విషయం పోలీసులకు తెలిసింది. దాంతో ఇరు కుటుంబాలను పీఎస్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. మాట వినకపోతే కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో పెళ్లిని నిలిపివేశారు.

సంబంధిత పోస్ట్