మార్కెట్‌లోకి మారుతి సుజుకి స్విఫ్ట్ CNG కారు లాంచ్ అయింది. ఇది కిలో గ్యాస్‌కు 32.85 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. దీని ధర రూ.8.19 లక్షల నుంచి ప్రారంభమై రూ.9.19 లక్షల వరకు ఉంది. మారుతి సుజుకి స్విఫ్ట్ మూడు సిలిండర్ల ఇంజిన్‌ను సీఎన్జీకి అనుకూలంగా మార్చింది. ఇది 5,700 ఆర్‌పీఎమ్ వద్ద 68.79 బిహెచ్‌పీ పవర్, 2,900 ఆర్‌పీఎమ్ వద్ద 101.8 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది.