ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో, వైద్యులు విజయవంతంగా బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేశారు. అది కూడా రోగిని అపస్మారక స్థితికి చేరుకోకుండానే. ఆపరేషన్ సమయంలో రోగి ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తూనే ఉన్నాడు. అదృష్టవశాత్తు ఆపరేషన్ విజయవంతమైంది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. త్వరలో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కానున్నారు. కళ్యాణ్ సింగ్ క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ ఇనిస్టిట్యూట్‌లో ఈ ప్రత్యేకమైన బ్రెయిన్ సర్జరీ జరిగింది.