ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం

78చూసినవారు
ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం
హైదరాబాద్ లో ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం జరిగింది. ఓ జంట నుంచి రూ.48 లక్షలను సైబర్ నేరగాళ్లు కాజేశారు. ఫేస్ బుక్ లో లింక్ ద్వారా ఆన్ లైన్ ట్రేడింగ్ లో బాధితుడు చేరాడు. మొదట్లో అధిక లాభాలు ఆశచూపిన కేటుగాళ్లు.. లాభాలకు ఆశపడి భార్య పేరుపై బాధితుడు పెట్టుబడి పెట్టారు. పలు ధపాల్లో రూ.48 లక్షలను దంపతులు పెట్టుబడి పెట్టారు. ట్రేడింగ్ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా కావాలంటే రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టాలని కేటుగాళ్లు చెప్పడంతో అనుమానంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్