గరిష్ఠ ఉష్ణోగ్రతలు.. వడదెబ్బతో ఆరుగురి మృతి

59చూసినవారు
గరిష్ఠ ఉష్ణోగ్రతలు.. వడదెబ్బతో ఆరుగురి మృతి
తెలంగాణలో వరుసగా నాలుగో రోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. శుక్రవారం 10 జిల్లాల్లోని 20 మండలాల్లో 46.3 నుంచి 46.7 డిగ్రీల సెల్సియస్‌ వరకు నమోదయ్యాయి. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా మంథని, సూర్యాపేట జిల్లా మునగాల, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల, ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పమ్మిలలో 46.7 డిగ్రీలు నమోదైంది. తీవ్రమైన ఎండల ధాటికి 18 జిల్లాల్లోని 95 మండలాల్లో వడగాలులు వీచాయి. మరోవైపు వడదెబ్బతో ఆరుగురి మృతి చెందారు.

సంబంధిత పోస్ట్