చేగుంట మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక సమాచారం మేరకు హైదరాబాద్ నుండి కామారెడ్డికి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు కారులో వెళ్తుండగా..వెనకాల నుండి లారీ ఢీకొట్టింది. దీంతో కారు డివైడర్ ను ఎక్కింది. కారులో ఉన్న వ్యక్తులకు ప్రాణాపాయం తప్పి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానిక ఎస్సై శుభాష్ గౌడ్ లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.