ఆవాలతో వినాయకుడి చిత్రాన్ని రూపొందించిన రామకోటి
వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అవాలను ఉపయోగించి గణపతి చిత్రాన్ని గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు, సేవారత్న, కళారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అద్భుతంగా చిత్రించి తన భక్తిని చాటుకున్నాడు. ఈ సందర్భంగా రామకోటి రామరాజు శనివారం మాట్లాడుతూ భగవంతుణ్ణి ఏ విధంగా పూజించిన పొందే ప్రతిఫలం అమోగం అన్నారు. వినాయకుడిని పూజిస్తే విఘ్నాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయన్నారు.