హుస్నాబాద్: ధాన్యం కొనుగోలు చేయక రోజుల తరబడి కాలం గడపాల్సి వస్తుంది
పండించిన పంటను అమ్ముకుందాం అనుకుంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేయకపోవడంతో రోజులు తరబడి కేంద్రంలో కాలం గడపాల్సి వస్తుందని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిది అయిలేని మల్లికార్జున రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్రకార్యదర్శి సూరంపెల్లి పర్శరాములు అన్నారు. హుస్నాబాద్ మండలం మహ్మదపూర్ గ్రామంలో కొనుగోలు కేంద్రంలో రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని పరిశీలించి అనంతరం వారు మాట్లాడారు.