చిలిపి చెడు మండలంలోని చిట్కుల్ గ్రామానికి చెందిన యువకుడు అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్కుల్ కు చెందిన బాల రాజు ఈ నెల 8న హైదరాబాద్ లోని ఘట్ కేసర్లో నిర్వహించిన ఆర్ఎస్ఎస్ శిబిరానికి వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి వెళ్లాడు. శిబిరం ముగిసినా బాలరాజు తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ రావడంతో ఆందోళన చెందిన కుటుంబీకులు, బంధువులు ఆదివారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎవరికైనా ఆచూకీ లభిస్తే తెలియజేయాలని తల్లిదండ్రులు కోరారు.