మెదక్ జిల్లా టేక్మాల్ మండలం వేల్పుగొండ గ్రామంలో రోగనిరోధక శక్తిని పెంచే హోమియోకేర్ యూనిటీ బూస్టర్ కిట్ల పంపిణీ జరిగింది. ఎంపీ బీబీ పటేల్ మరియు ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ సహకారంతో ఈ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు భక్తుల వీరప్ప, సిద్ధిరాములు, సర్పంచ్ బోయిన నారాయణ, గ్రామ పార్టీ అధ్యక్షుడు రాఘవేందర్, గ్రామ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. గ్రామంలోని ప్రతి ఒక్కరు వీటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.