మెదక్ పట్టణంలో గల నర్స్కేడ్ ఏరియాలో జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. ఆయిల్ ఫామ్ సాగులో మెదక్ జిల్లా అగ్రస్థానంలో నిలవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను శుక్రవారం ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లాలో 2024-25 సంవత్సరానికి 2 వేల ఎకరాలలో ఆయిల్ ఫామ్ తోటలు సాగుకు ప్రణాళికలు చేసుకోవడం జరిగిందని చెప్పారు.