మెదక్ జిల్లాలోని ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక సమాచారం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. టేక్మాల్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన నిరుడి యాదయ్య, లక్ష్మయ్య అనే ఇద్దరు వ్యక్తులు బోనాల పండుగకు కావలసిన సామాను కొరకు జోగిపేట పట్టణానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో చింతకుంట-అన్నాసాగర్ మధ్యలో బైక్ అదుపుతప్పి కిందపడి తీవ్రగాయాల పాలు అయ్యారు. వీరిని స్థానికులు అంబులెన్సులో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.