మెదక్ జిల్లాలో వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగిందని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించుకున్నామని, దీనికి కృషి చేసిన పోలీస్ అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. మిలాద్- ఉన్- నబీ పండుగ ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో ప్రజలందరూ జరుపుకున్నారని చెప్పారు.