మెదక్ నియోజకవర్గం - Medak Constituency

మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు బ్రాహ్మణుల ప్రత్యేక ఆశీర్వచనాలు

మెదక్ పార్లమెంటులో ఉన్న బ్రాహ్మణులు నీలం మధుని కలిసి వారి విజయాన్ని కాంక్షిస్తూ వేద ఆశీర్వచనం అందజేశారు. తదనంతరం మధు మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న బ్రాహ్మణులను అందరినీ కూడా ఏకీకృతం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలతో వారికి లబ్ది చేకూర్చేలా కృషి చేస్తానని ,తద్వారా గ్రామాలలో పలు వైదిక క్రతువులు జరిపించే విధంగా ఏర్పాటు చేస్తానని, మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్న శిధిలమైన దేవాలయాలు పునరుద్ధరణ చేస్తానని,మెదక్ పార్లమెంటు పరిధిలో చిన్న దేవాలయాలకు ధూప దీప నైవేద్య పథకాలు అన్ని అందేలా చూస్తామని , బ్రాహ్మణుల అభ్యున్నతికి అన్ని విధాల తనవంతు ఉంటుందని హామీ ఇచ్చారు.

వీడియోలు


మెదక్ జిల్లా