సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ హత్నూర మండల పరిధిలోని రొయ్యపల్లి, షేర్ఖాన్పల్లి, నాగారం, పలుగు మీది నల్ల పోచమ్మ ఆలయ అటవీ ప్రాంతాలలో ఆదివారం ఉదయం 21 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలో తేమశాతం 95% గా ఉంది. ఉదయం వేళలో చలి గాలులతో మండల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆకాశం మేఘావృతమై ఉంది.