మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం చేరీల గ్రామంలో కురుమల కులస్థులపై వారం రోజుల క్రితం దాడి చేయగా.. ఈ దాడిలో కురుమ కులానికి చెందిన భిక్షపతి, నెల్లూరు షేకులుకు తీవ్రంగా గాయాలయ్యాయని వారిని ఉమ్మడి మెదక్ జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు నగేష్ కురుమ ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురుమలపైన జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కురుమ యూత్ అధ్యక్షులు అరుణ్ కురుమ, జిల్లా అధ్యక్షులు గంగారాం కురుమ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు దూడ యదేశ్వర్ కురుమ, మండల అధ్యక్షులు, జిల్లా నాయకులు సారా మల్లేష్ కురుమ, చిగురు ఎల్లేష్ కురుమ, శేఖర్ కురమ, మొగులయ్య కురుమ తదితరులు పాల్గొన్నారు.