మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో గురువారం లయన్స్ క్లబ్ లో లక్ష్మారెడ్డి మూర్తికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం చాముండేశ్వరి ఫంక్షన్ హాల్ లో వాకిటి లక్ష్మారెడ్డి మెమోరియల్ & చారిటబుల్ ట్రస్ట్, యువజన, కార్యకర్తల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి రక్తదానం చేశారు. నియోజకవర్గ స్థాయి ప్రజా ప్రతినిధులు, బారాసా సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.