పార్టీ సభ్యత్వం రెండు లక్షల ఇన్సూరెన్స్ అందజేత: ఎమ్మెల్యే

84చూసినవారు
పార్టీ సభ్యత్వం రెండు లక్షల ఇన్సూరెన్స్ అందజేత: ఎమ్మెల్యే
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం జాజి తండాకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మాలోత్ అంబుర్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ సందర్బంగా పార్టీ సభ్యత్వం ఇన్సూరెన్స్ రెండు లక్షల రూపాయల చెక్కును మృతుని భార్య శాంతికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో బారాసా నాయకులు రాజీపేట పాషా, హన్మంత్ రెడ్డి, నర్సింహారెడ్డి, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్