కార్మికులకు నెలకు 26 వేల వేతనం ఇవ్వాలి
కాంటాక్ట్ కార్మికులకు నెలకు 26 వేల రూపాయల వేతనం ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు మల్లేశం డిమాండ్ చేశారు. ఈనెల 28వ తేదీన సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించే ధర్నా కరపత్రాలను బుధవారం సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్లో ఆవిష్కరించారు. కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సాయిలు, నాయకులు పాల్గొన్నారు.