ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించాలని డిసి హెచ్ ఎస్ డాక్టర్ సంగారెడ్డి అన్నారు. జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో వైద్యులు పాల్గొన్నారు.