ఆటో కార్మికులకు మంత్రి పొన్నం కీలక పిలుపు

64చూసినవారు
ఆటో కార్మికులకు మంత్రి పొన్నం కీలక పిలుపు
తెలంగాణలో ఆటో కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని.. బంద్‌ను వాయిదా వేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. మంగళవారం HYDలోని మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రితో రాష్ట్ర ఆటో &ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ యూనియన్ ఐక్య కార్యాచరణ సమితి నేతలు కలిశారు. తమ ప్రభుత్వం ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. ఈ నెల 6న MLA కూనంనేని, MLC కోదండరాం, రవాణా శాఖ సిబ్బందితో చర్చిస్తామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్