హర్యానాలోని గురుగ్రామ్ జిల్లా బాద్షాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాకేష్ ఝంగు చనిపోయారు. శనివారం ఉదయం ఆయన గుండెపోటుతో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గుండెపోటు రాగానే ఆయనను ఆసుపత్రికి తరలించామని, ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని చెప్పారు. ఆయన హర్యానా ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (హెచ్‌ఎఐసి) ఛైర్మన్‌గానూ వ్యవహరిస్తున్నారు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.