ప్రధాని మోదీ-అదానీ కలిసి దేశాన్ని లూటీ చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అందుకే రాహుల్ గాంధీ మోడీ- అదానీ పై గళం విప్పారని చెప్పారు. 'అదానీ-మోదీ ఒక్కటే అని ఆరోపించారు. రాహుల్ గాంధీ విజన్ ఉన్న నాయకుడు. త్యాగ శీలి. తనకు ప్రధాని అయ్యే అవకాశం ఉన్నప్పటికీ మన్మోహన్ సింగ్ ని ప్రధానిని చేశారు. మోదీ పేదల పక్ష పాతి కాదు.. ధనికుల పక్షపాతి' అని ఘాటు విమర్శలు చేశారు.