ప్రధాని మోదీకి ఫోన్ చేసిన బంగ్లా తాత్కాలిక ప్రధాని యూనస్.. బంగ్లాలో హిందూవుల భద్రతకు హామీ

60చూసినవారు
ప్రధాని మోదీకి ఫోన్ చేసిన బంగ్లా తాత్కాలిక ప్రధాని యూనస్.. బంగ్లాలో హిందూవుల భద్రతకు హామీ
బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనార్టీల భద్రతను కాపాడతామని తాత్కాలిక ప్రధాని ముహమ్మద్ యూనస్ తనకు హామీ ఇచ్చినట్టు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు. ఈ మేరకు యూనస్‌ తనతో ఫోన్‌లో మాట్లాడారని మోదీ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులపై వారి అభిప్రాయాలు కూడా పంచుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా బంగ్లాలో ప్రజాస్వామ్యం, సుస్థిరత, శాంతియుత, ప్రగతిశీల ప్రభుత్వానికి భారత్ మద్దతు ఉంటుందని మోదీ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్