TG: సూర్యాపేట జిల్లాలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. హుజూర్‌నగర్ మండలం లకారం గ్రామానికి చెందిన మమత అనే మహిళ, తన కొడుకు అయాన్‌తో కలిసి బుధవారం బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు వెంటనే బావిలోకి దూకి కాపాడే ప్రయత్నం చేశారు. అయితే ఈ ఘటనలో మమత క్షేమంగా ఉండగా కొడుకు మాత్రం మృతిచెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.