1982లో ఇజ్రాయిల్-పాలస్తీనా గెరిల్లాల పోరు మధ్య చిక్కుక్కున్న 37 మంది పిల్లలను మదర్ థెరిసా కాపాడారు. 1997న మార్చి 13న మిషనరీస్ ఆఫ్ చారిటీ అధినేత పదవికి థెరిసా రాజీనామా చేశారు. అదే ఏడాది అనారోగ్యంతో సెప్టెంబర్ 5న మరణించారు. అయితే, ఆమెను ఇప్పటికీ బోర్డు అధినేతగా ఎన్నుకుంటూ, ఆమె తమతోనే ఉందని చారిటీ సభ్యులు చాటిచెబుతున్నారు. 'ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్న' అన్న నినాదంతోనే విశ్వమాతగా పేరు గాంచిన మదర్ థెరీసాకు సెయింట్‌హుడ్ హోదా కూడా దక్కింది.