నాగార్జున సాగర్ 20 గేట్లు ఓపెన్

82చూసినవారు
నాగార్జున సాగర్ నిండు కుండను తలపిస్తోంది. ఎగువ నుంచి 3.55 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. నిన్న ఉదయం 6 గేట్లు ఎత్తగా, ప్రస్తుతం 20 గేట్లను ఓపెన్ చేశారు. ఎడమ, కుడి కాల్వలు, SLBC, జల విద్యుత్ ద్వారా 1.96 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్ గరిష్ఠ నీటి మట్టం 590 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 312TMCలు కాగా ప్రస్తుతం 584 అడుగుల్లో 294TMCల నిల్వను కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్