వంగూరు: సర్వేను పరిశీలించిన ఆర్డిఓ
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర సర్వే లో భాగంగా ఆదివారం వంగూరు మండలం వెంకటాపూర్, వంగూరు లలో నిర్వహిస్తున్న సర్వేను ఆదివారం ఆర్డిఓ శ్రీనివాస్ సందర్శించి సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. సామాజిక ఆర్ధిక విద్య, ఉపాధి, రాజకీయ కుల, గణన ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కార్యక్రమం చేపట్టిందన్నారు. సర్వేకు వచ్చిన ఎన్యూమరేటర్ లకు ప్రజలు సహకరించాలని అన్నారు.