చారకొండ మండలం జూపల్లి గ్రామంలో మాల ముత్యాలమ్మ అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఈ విషయాన్ని రాములు యాదవ్, సిరాజ్ ల ద్వారా జూపల్లి భాస్కర్ రావుకి తెలియజేశారు. జూపల్లి భాస్కరావు వెంటనే స్పందించి పదివేల రూపాయలు వారి కుటుంబానికి ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాములు యాదవ్, బొజ్జన్న బాల్ రాజ్, మహేష్, శేఖర్, భాస్కర్ రావు, యువసేన, ఎండి సిరాజ్,తదితరులు పాల్గొన్నారు.