నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండల కేంద్రంలో మంగళవారం కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్) నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ మండల ప్రధాన కార్యదర్శి పి. అశోక్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎంగా పని చేస్తున్న రాములు పై దాడి చేసిన వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండు చేశారు. ఈ కార్యక్రమంలో పి. శ్రీను, జె. మల్లేష్, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.