కల్వకుర్తి: పీడిత వర్గాల హక్కుల కోసం పోరాటం
పేదల పెన్నిధి గద్దర్ తన జీవితమంతా పీడిత వర్గాల హక్కుల కోసం పోరాటం చేశారని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్ పర్సన్ వెన్నెల పేర్కొన్నారు. ఆదివారం కల్వకుర్తి ఎమ్మార్వో ఆఫీస్ ముందర గద్దర్ విగ్రహావిష్కరణ కోసం స్థల పరిశీలన, భూమి పూజ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి గద్దర్ సహకారం ఎంతో ఉందని అన్నారు. సమాజానికి అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.