కడ్తాల్: త్వరలో డిసిసిబి నెట్ బ్యాంకింగ్ సేవలు.. పీఏసీఎస్ చైర్మన్
రాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్రావును డీసీసీబీ డైరెక్టర్, ఆమనగల్లు పీఏసీఎస్ చైర్మన్ గంప వెంకటేశ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శాలువాలతో సత్కరించారు. కడ్తాల్ మండల కేంద్రంలో డీసీసీబీ బ్యాంక్‌ను ఏర్పాటు చేయాలని ఆయనకు వినతి పత్రం అందజేశారు. బ్యాంక్ ఏర్పాటు వల్ల రైతులకు సౌకర్యంగా ఉంటుందని, త్వరలో నెట్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు.