నాగర్ కర్నూల్ హౌసింగ్ బోర్డులో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం చివరి ఆదివారం భగవద్గీత సామూహిక పారాయణం ఆదివారం భక్తి పూర్వకంగా జరిగింది. ఈ కార్యక్రమం ఉదయం 10: 00 గంటలకు ప్రారంభమై భక్తులు భగవద్గీత పఠనంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. భగవద్గీత పఠనం జీవితంలో విలువలను నేర్పిస్తుందని ఆలయ పూజారి ఈ సందర్భంగా పేర్కొన్నారు.