వార్డుల్లో ఎక్కడికక్కడే పెండింగ్ పనులు: ఎమ్మెల్యే
కల్వకుర్తిలోని వివిధ వార్డుల్లో పెండింగ్ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశానికి హాజరై మాట్లాడుతూ మున్సిపాలిటీకి గతంలో అప్పు కింద 15 కోట్లు మంజూరు అయ్యాయని, వాటిని సరైన పద్ధతిలో ఖర్చు చేయకపోవడంతో మౌలిక వసతులకు సంబంధించిన పనులు పెండింగ్లో పడ్డాయన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలన్నారు.