పంప్ హౌస్ నీట మునిగిన ఘటనపై మాజీ ఎమ్మెల్యే జనార్దన్ ఆగ్రహం

53చూసినవారు
నాగర్ కర్నూల్ జిల్లాలోని వట్టెం రిజర్వాయర్ పంప్ హౌస్ నీట మునిగిన ఘటనపై మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని ఆరోపించారు. భారీ వర్షాల నేపథ్యంలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేయకపోవడం, రైతుల పట్ల నిర్లక్ష్యమే ఈ నష్టానికి కారణమని అన్నారు. వెంటనే ఈ నష్టాన్ని అంచనా వేసి పంప్ హౌస్ పనులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్