సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

1580చూసినవారు
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఏఐటీయూసీ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం చౌటుప్పల్ ప్రభుత్వ హాస్పిటల్ లో మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ అనుబంధం) సమావేశనికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని అన్నారు. అనంతరం కార్మికులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పల్లె శేఖర్ రెడ్డి, పిల్లి శంకర్, మోహన్ రెడ్డి, కార్మికులు కిష్టయ్య, బాలమ్మ, మహేశ్వరి,అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్