దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. గురువారం చింతపల్లి మండల పరిధిలోని గొడుకొండ్ల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన శ్రీ సంతోషి మాత 12వ వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పవన్, గోవర్ధన్, గోపాల్, కృష్ణ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.