దేవరకొండ: నియోజకవర్గంలోని పలు గురుకులాలను శనివారం ఎమ్మెల్యే బాలు నాయక్ తనిఖీ చేశారు. బియ్యం, వంట సామాగ్రి, ఉపాద్యాయుల హాజరు రిజష్టర్ పరిశీలించారు. న్యూ మెనూ ప్రారంభించి విద్యార్థులతో కలిసి భోజనం చేసిన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు మెస్ చార్జీలను 40 శాతం పెంచి అండగా నిలిచిందన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే చిత్ర పటాలకు థాంక్యూ చెబుతూ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.