రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

61చూసినవారు
రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం దేవరకొండ పట్టణంలో రంజాన్ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. మైనారిటీల సంక్షేమం కోసం గత ప్రభుత్వం అమలు చేసిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపాయని, అవన్నీ ప్రస్తుతం గుణాత్మక ఫలితాలనిస్తున్నాయని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్