రిజర్వాయర్ రైతులతో సమావేశం

859చూసినవారు
రిజర్వాయర్ రైతులతో సమావేశం
ప్రాజెక్టుల కోసం సర్వం కోల్పోయిన గొట్టిముక్కల రిజర్వాయర్ గ్రామస్తులకు ప్రభుత్వ పరిహారంతో పాటు ఉద్యోగం కల్పిస్తానని చెప్పి మాట నిలబెట్టుకోలేదని గొట్టుముక్కల రైతులు గ్రామస్తులు అన్నారు. శుక్రవారం గొట్టిముక్కల రిజర్వాయర్ గ్రామానికి చెందిన రైతులు గ్రామస్తులు దేవరకొండ ఆర్డిఓ కార్యాలయంలో ఆర్డిఓ అధికారులు, ఐబిడిఈ కరుణాసాగర్, దేవరకొండ డిఎస్పి నాగేశ్వరరావు, డిప్యూటీ తాసిల్దార్ తో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. అధికారులతో తమకు న్యాయం చేయాలని ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని గ్రామస్థులు కోరారు. అప్పటి కలెక్టర్ తమ గ్రామానికి వచ్చి సర్వస్వం భూములు కోల్పోయిన వారికి ఇళ్ల స్థలాలు ఇండ్లతో పాటు ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీలు ఇచ్చి తమను మభ్యపెట్టారని వాపోయారు.

దేవరకొండ మండలంలోని గొట్టిముక్కల గ్రామస్తులు రైతులు సర్పంచ్ కడారి అయ్యన్నతో కలిసి తమకు న్యాయం జరిగేంతవరకు ప్రాజెక్టులో పనులు నిలిపివేయాలని కోరారు. వ్యవసాయ ఆధారిత గ్రామం ఆయన తమను ఇప్పుడు ఉన్నపలంగా వెళ్ళిపొమ్మనడం ఎంతవరకు సమంజసమని అన్నారు. గతంలో తాము భూములను ఇచ్చేటప్పుడు అధికారులు నల్లగొండ జిల్లాలో జరిగేటువంటి రిజర్వాయర్స్ లో ఏ విధంగా పరిహార ఇచ్చారో వాటికి అనుగుణంగా కట్టిస్తామని చెప్పి సింగరాజుపల్లిలో రూ.4 లక్షల 15 వేలు ఎకరానికి ఇస్తే తమకు నాలుగు లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. పరిహారం సింగిల్ అటెండ్ లో ఇచ్చి ఉంటే తమకు ఇంత ఇబ్బంది కలిగేది కాదని, ఆరు సంవత్సరాలు దాటిన తర్వాత నాలుగు లక్షల రూపాయలను తీసుకొని మేము ఎక్కడ భూములు కొనుక్కోవాలని ప్రశ్నించారు. తమకు ప్రభుత్వమే ఇండ్లు నిర్మించి ఇంటికో ఉద్యోగం ఇచ్చేంతవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో దేవరకొండ సిఐ శ్రీనివాస్, డిఏఓ అయూబ్ ఖాన్, గ్రామస్తులు గణేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్